Kaushal: 'బిగ్ బాస్ 2' విజేతగా కౌశల్ నిలిచినా... మజా లేదంటున్న ఫ్యాన్స్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు బిగ్ బాస్ సీజన్ 2 ముగిసింది. అందరూ అనుకున్నట్టుగానే కౌశల్ విజయం సాధించాడు. ఈ రియాల్టీ గేమ్ షోలో కౌశల్ గెలుస్తాడని, గెలవాలని ప్రతి ఇంట్లోని ప్రేక్షకుడూ కోరుకున్నాడు. తీరా అతనే విజేతగా నిలిచిన తరువాత, అబ్బే ఆ మజా రాలేదంటున్నారు. ప్రేక్షకులు ఇలా వ్యాఖ్యానించడం వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? హౌస్ లో ఏం జరుగుతుందన్న విషయం ఒకరోజు ముందుగానే లీక్ అవుతూ ఉండటమే!

బిగ్ బాస్ తొలి వారం ప్రారంభమైనప్పటి నుంచి ఏ వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న విషయం ముందే తెలిసిపోతూ వచ్చింది. ఫైనల్స్ లో సైతం అదే జరిగింది. కౌశల్ గెలిచాడని, గీతా మాధురి రన్నరప్ అని, గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్టుగా విక్టరీ వెంకటేశ్ వచ్చాడని కూడా ఆదివారం ఉదయానికే ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. గెలిచే అభ్యర్థి పేరు బయటకు రాకుండా ఉంటే గేమ్ షోపై మరింత ఆసక్తి ఉండేదని, ఇప్పుడు సోషల్ మీడియా కారణంగా ఆ అవకాశం లేకుండాపోయిందని ఫ్యాన్స్ అంటున్నారు.
Go Back to Shorts
Kaushal
Biggboss
Fans
Leaks

More Telugu News