రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత.. తమ నేతను చూపించాలంటూ అనుచరుల డిమాండ్!

షార్ట్స్‌లో చూడండి
హైదరాబాద్, జూబ్లీహిల్స్ లోని  టీ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్దకు రేవంత్ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో చేరుకున్నారు. రేవంత్ ను చూపించాలంటూ ఆయన అనుచరుల డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు, రేవంత్ రెడ్డి అనుచరులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.

అనుచరుల ఒత్తిడి నేపథ్యంలో విచారణ మధ్యలో ఉన్న రేవంత్ ను పోలీసులు బయటకు తీసుకువచ్చారు. తన అభిమానులకు, కార్యకర్తలకు అభివాదం చేసిన రేవంత్ ను తిరిగి లోపలికి తీసుకెళ్లారు. కాగా, రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఆయన అనుచరులు నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ను నిరసిస్తూ రేవంత్ ఇంటి వద్ద ఆయన అనుచరులు బైఠాయించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Go Back to Shorts
Revanth Reddy
Congress

More Telugu News