రేవంత్ రెడ్డికి సంబంధించిన పాత విషయాన్ని బయటపెట్టిన గట్టు రామచంద్రరావు
- దొంగ ఓటు వేస్తూ పట్టుబడ్డ చిన్న కార్యకర్త రేవంత్
- ఇన్ని వందల కోట్లు ఎలా సంపాదించారు?
- రేవంత్ మరో డేరా బాబా
రేవంత్ రెడ్డి తప్పు చేయలేదని ఏ ఒక్క కాంగ్రెస్ నేత కూడా చెప్పలేదని... రాష్ట్రానికి ద్రోహం చేయవద్దు అనుకుంటే రేవంత్ ను సమర్థించకుండా ఉండాలని అన్నారు. రేవంత్ మరో డేరా బాబా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'రేవంత్ ఇళ్లలో జరుగుతున్న సోదాల వెనక ఏ కాంగ్రెస్ నేత ఉన్నాడో' అంటూ అనుమానం వ్యక్తం చేశారు. టీడీపీలో కూడా రేవంత్ కు చాలా మంది శత్రువులు ఉన్నారని చెప్పారు.