రేవంత్ రెడ్డి ఇంట్లో కొనసాగుతున్న సోదాలు!
- జూబ్లీహిల్స్ సహా 15 చోట్ల కొనసాగుతున్న సోదాలు
- రేవంత్ కు అమెరికా, హాంకాంగ్, మలేషియాల్లో ఆస్తులు
- కౌలాలంపూర్, హాంకాంగ్ బ్యాంకులలో అకౌంట్లు
రేవంత్ రెడ్డికి అమెరికా, హాంకాంగ్, మలేషియాలలో ఆస్తులున్నట్లు ఆరోపణలు. కౌలాలంపూర్ లోని ఆర్ హెచ్ బీ బ్యాంక్ లో రేవంత్ రెడ్డి ఖాతాలో ఒకే రోజు 20 లక్షల సింగపూర్ డాలర్లు, హాంకాంగ్ లోని బ్యాంక్ ఆఫ్ ఈస్ట్ ఏసియాలో ఉన్న రేవంత్ అకౌంట్ లో 2014లో ఒకే రోజు 60 లక్షల మలేషియా రిగ్గెట్లు జమైనట్టు ఈ సోదాల్లో తెలిసింది.
కాగా, ఐటీ అధికారుల సమాచారం మేరకు కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగించుకున్న రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. రేవంత్ కోసం ఎదురుచూస్తున్న అధికారులు ఆయన రాగానే నివాసంలోకి తీసుకెళ్లారు.