జూబ్లీహిల్స్ లోని నివాసానికి చేరుకున్న రేవంత్ రెడ్డి!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ, ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సోదాలు ప్రారంభించిన సమయంలో రేవంత్ ఎన్నికల ప్రచారంలో వున్నారు. కోస్గిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం రేవంత్ రెడ్డి బయలుదేరి హైదరాబాదు, జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్నారు. రేవంత్ ఇంటి వద్దకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కాగా, ఐటీ అధికారుల సోదాల నేపథ్యంలో ఆయన నివాసం వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. 
Go Back to Shorts
jublihills
Revanth Reddy

More Telugu News