జైల్లో తిన్న చిప్పకూడు మీద ఒట్టేసి చెబుతున్నా.. కేసీఆర్ ని గద్దె దించుతా!: రేవంత్ రెడ్డి
- మీరు ఉన్నారనే ధైర్యంతోనే హైదరాబాదుకు వెళ్తున్నా
- అరెస్ట్ చేస్తే.. జైలు నుంచే నామినేషన్ వేస్తా
- కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించేంత వరకు నిద్రపోను
జైల్లో తిన్న చిప్పకూడు మీద ఒట్టేసి చెబుతున్నా... కేసీఆర్ కుటుంబాన్ని గద్దె దించేంత వరకు నిద్రపోనంటూ రేవంత్ ప్రతిజ్ఞ చేశారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకే, ఏమీ చేయలేకే... ఐటీ దాడులు చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. మోదీ, కేసీఆర్ లు కలసి అక్రమ కేసులను బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా... తన విజయాన్ని అడ్డుకోలేరని చెప్పారు.