Revanth Reddy: రేవంత్ రెడ్డి ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించిన ఐటీ అధికారులు!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రేవంత్ హైదరాబాదులో లేరు. ఆయన ఎన్నికల ప్రచారంలో వున్నారు. ప్రస్తుతం హైదరాబాదులోని రేవంత్ నివాసం ఐటీ అధికారుల అధీనంలో ఉంది.

రేవంత్ ఇంటి వద్దకు వచ్చిన ఐటీ అధికారులు తలుపు తీయాలని పని మనుషులను అడిగారు. 'సార్ ఇంట్లో లేరు. ఆయనకు ఫోన్ చేయండి' అని పని మనుషులు చెప్పడంతో... ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. వెంటనే రేవంత్ కుటుంబసభ్యుల ఫోన్లను స్విచ్చాఫ్ చేయించారు. ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నా... ఏమేం గుర్తించారో ఇంకా తెలియరాలేదు. 
Go Back to Shorts
Revanth Reddy
it
raids
congress

More Telugu News