bjp: ఆర్.కృష్ణయ్యకు మంచి ఆఫర్ ఇచ్చిన టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్!

షార్ట్స్‌లో చూడండి
తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్యకు టీ-బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ మంచి ఆఫర్ ఇచ్చారు. హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీలోకి కృష్ణయ్య వస్తానంటే ఎంపీ టికెట్ ఇవ్వడానికైనా సిద్ధమేనని అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా యువసమ్మేళనాలు నిర్వహిస్తామని, అక్టోబర్ మొదటి వారంలో 30 మంది అభ్యర్థులతో కూడిన బీజేపీ తొలి జాబితా ప్రకటించనున్నట్టు చెప్పారు. వచ్చే నెలలో కరీంనగర్, వరంగల్ లో భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని, ఈ సభలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారని లక్ష్మణ్ చెప్పారు.
Go Back to Shorts
bjp
laxman
r.krishnaiah

More Telugu News