మరో యువకుడితో కనిపించిందని... గర్ల్ ఫ్రెండ్ ని ముక్కలుగా నరికిన యువకుడు!
- న్యూఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ ప్రాంతంలో ఘటన
- మరో యువకుడితో ప్రియురాలిని చూసిన రిజ్వాన్
- కత్తితో ముక్కలు చేసి మురుగుకాలువలో పడేసిన వైనం
ఇటీవల ఆమె మరో యువకుడితో స్నేహంగా ఉంటోందని తెలుసుకున్న రిజ్వాన్ ఆమెతో గొడవపడ్డాడు. ఆపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. శవాన్ని ముక్కలు చేసి రెండు బ్యాగుల్లో కుక్కి, వాటిని బాలాపుల్లా ఫ్లయ్ ఓవర్ కింద ఉండే కాలువలో పడేశాడు. ఆపై పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగింది చెప్పాడు. కేసు నమోదు చేశామని, రిజ్వాన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.