గదిలో మందుకొట్టి గోల... చూద్దామని వెళితే రేప్ చేసేందుకు చూసిన ఏడుగురు!
- న్యూఢిల్లీ శివార్లలోని గురుగ్రామ్ లో ఘటన
- విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన యువతి
- తొంగిచూస్తే లోపలికి లాగే ప్రయత్నం చేసిన యువకులు
వారిపై ఫిర్యాదు చేయాలని భావించి, గదిలో ఎవరు ఉన్నారో చూద్దామని నెమ్మదిగా తొంగి చూడగా, ఆమె చేతిలోని లంచ్ బాక్స్ కిందపడింది. ఈ శబ్దాన్ని విన్న గది లోపలి యువకులు, ఆమెను గట్టిగా పట్టుకుని గదిలోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వారితో పెనుగులాడి, అరుస్తూ, తప్పించుకున్న యువతి, తల్లిదండ్రులు, చుట్టుపక్కల వారి సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గదిలో ఇంకా చాలామంది ఉన్నారని, వారిని కూడా అరెస్ట్ చేయాలని అపార్ట్మెంట్ వాసులు ఆందోళన చేయడంతో మరో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.