surya: బాల అభిమాని ముచ్చట తీర్చిన సూర్య

షార్ట్స్‌లో చూడండి
తెరపై అన్యాయాలను ఎదిరించే హీరోగానే కాదు .. నిజ జీవితంలో మానవత్వంతో వెంటనే స్పందించే రియల్ హీరోగాను సూర్య కనిపిస్తారు. తన ట్రస్ట్ ద్వారా చాలామంది పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తోన్న సూర్య, అనారోగ్యంతో బాధపడుతోన్న పిల్లలకు కూడా సాయాన్ని అందిస్తూ ఉంటారు. అరుదైన వ్యాధితో బాధపడుతోన్న దినేశ్ అనే బాలుడికి తన అభిమాన నటుడైన సూర్యను చూడాలనిపించిందట.

ఈ విషయం తెలుసుకున్న సూర్య .. ఆ పిల్లాడిని తన ఇంటికి పిలిపించుకుని సరదాగా గడిపారు. ఆ పిల్లాడికి కొన్ని కానుకలను అందజేయడమే కాకుండా .. సెల్ఫీలు కూడా తీసుకుని అతణ్ణి ఉత్సాహపరిచారు. అంతే కాకుండా ఆ పిల్లవాడి వైద్యానికి ఎంత ఖర్చు అయినా తాను భరిస్తానని హామీ ఇచ్చారట. ఆ పిల్లాడి తల్లిదండ్రులు సూర్యకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ సూర్య మంచి మనసును అభినందిస్తున్నారు.  
Go Back to Shorts
surya

More Telugu News