rahul vijay: హీరోగా వచ్చేస్తోన్న ఫైట్ మాస్టర్ విజయ్ తనయుడు

షార్ట్స్‌లో చూడండి
హీరోల వారసులు .. దర్శక నిర్మాతల వారసులు హీరోలుగా తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. ఈ నేపథ్యంలో పలు చిత్రాలకి ఫైట్ మాస్టర్ గా పనిచేసిన విజయ్ తనయుడు రాహుల్ విజయ్ మరో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోగా రానున్నాడు. ఆయన హీరోగా రాము కొప్పుల దర్శకత్వంలో చేసిన 'ఈ మాయ పేరేమిటో' సినిమా ఈ నెల 21వ తేదీన విడుదల కానుంది.

ఈ సందర్భంగా రాహుల్ విజయ్ మాట్లాడుతూ .." చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణంలో పెరిగాను. నేను హీరోను కావాలనేది మా నాన్నగారి కల. మా నాన్నగారి కోరిక మేరకే లారెన్స్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాను. దేవదాస్ కనకాల .. సత్యానంద్ దగ్గర నటనను నేర్చుకున్నాను. బ్యాంకాక్ లో ఫైట్స్ లో శిక్షణ పొందాను. సరదాగా వుండే ఓ కాలనీ అబ్బాయిగా ఈ సినిమాలో నేను కనిపిస్తాను. ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందనీ .. నా కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.     
Go Back to Shorts
rahul vijay
kavya

More Telugu News