surya: న్యూ లుక్ తో ఆశ్చర్యపరుస్తోన్న సూర్య

షార్ట్స్‌లో చూడండి
తమిళంలో ఒకవైపున అజిత్ .. మరో వైపున విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతుంటే, తనదైన ప్రత్యేకతను నిలుపుకోవడానికి సూర్య విభిన్నమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. రీసెంట్ గా ఆయన సెల్వ రాఘవన్ సినిమా 'ఎన్జీకే'ను పూర్తిచేశాడు. రకుల్ ప్రీత్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటించిన ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా తరువాత సూర్య .. కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగు జరుపుకుంటోంది. ఈ రెండవ షెడ్యూల్లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మోహన్ లాల్ .. ఆర్య ముఖ్యమైన పాత్రలను పోషిస్తోన్న ఈ సినిమాలో, సూర్య డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ కొత్త లుక్ సూర్య అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయనున్నారు. 
Go Back to Shorts
surya
sayesha

More Telugu News