మాది కూడా అభివృద్ధి చెందుతున్న దేశమే.. మీకెందుకు సాయం చేయాలి?: అమెరికా అధ్యక్షుడు ట్రంప్
- అమెరికా అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్య
- భారత్, చైనాలకు సబ్సిడీలపై ఆగ్రహం
- రాయితీలను ఆపేస్తామని హెచ్చరిక
భారత్, చైనాలకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం లేదనీ, వీటిని నిలిపివేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అమెరికా అనవసరంగా విదేశాలకు చేస్తున్న సాయాన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చైనా అభివృద్ధి కోసం పనిచేస్తోందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా-చైనాల మధ్య ఏటా 500 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఏర్పడటానికి ఇదే కారణమనీ, దీన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు.