kcr: కేసీఆర్ ని ఆపద్ధర్మ సీఎంగా తొలగించాలి: కోదండరామ్

షార్ట్స్‌లో చూడండి
అసెంబ్లీని రద్దు చేసి తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్న కేసీఆర్ ని ఆపద్ధర్మ సీఎంగా తొలగించాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ డిమాండ్ చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, సుపరిపాలన అందించే ముఖ్యమంత్రి ఎవరూ అసెంబ్లీని రద్దు చేయరని, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యమని, మార్పు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. గవర్నర్ నరసింహన్ ని కలిసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరతామని అన్నారు. త్వరలోనే తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించనున్నట్టు చెప్పారు. 
Go Back to Shorts
kcr
kondanda ram

More Telugu News