అమ్మాయి నచ్చితే ప్రపోజ్ చేయండి.. తిరస్కరిస్తే కిడ్నాప్ చేయండి: బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
- ముఖ్యమంత్రి సమక్షంలోనే అమ్మాయిలపై అనుచిత వ్యాఖ్యలు
- విరుచుకుపడుతున్న నెటిజన్లు
బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సర్వత్ర ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. రామ్ కడామ్ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్‌ను ఎన్‌సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్ సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయింది. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు అలవాటుగా మారిందని జితేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులే ఇలా మాట్లాడితే స్త్రీలు స్వేచ్ఛగా ఎలా తిరగ గలుగుతారని ప్రశ్నించారు. మరోవైపు నెటిజన్లు కూడా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై దుమ్మెత్తి పోస్తున్నారు.