రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం 10 కిలోల బరువు తగ్గనున్న ప్రభాస్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రొమాంటిక్ లవ్ స్టోరీ కోసం 10 కిలోల బరువు తగ్గనున్న ప్రభాస్

  • 'సాహో' షూటింగులో బిజీగా ప్రభాస్ 
  • ఈ నెల 6వ తేదీన నెక్స్ట్ మూవీ లాంచ్ 
  • రొమాంటిక్ హీరోగా కనిపించనున్న ప్రభాస్
ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో 'సాహో' సినిమా రూపొందుతోంది. 'బాహుబలి' తరువాత ప్రభాస్ చేస్తోన్న భారీ బడ్జెట్ మూవీ ఇది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంటూ ఉండగానే ప్రభాస్ మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేశాడు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. 'బాహుబలి' కోసం బరువు పెరిగిన ప్రభాస్ .. కథా పరంగా 'సాహో'లోను అదే పర్సనాలిటీతో కనిపించనున్నాడు. కానీ రాధాకృష్ణ దర్శకత్వంలో చేసే మూవీ రొమాంటిక్ లవ్ స్టోరీ కావడంతో, ప్రభాస్ కాస్త స్లిమ్ గా కనిపించవలసి వుంది. అందుకోసం ఆయన 10 కిలోల బరువు తగ్గనున్నాడట. ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేశారు. మరో కథానాయిక పాత్ర కోసం రకుల్ .. రాశిఖన్నా పేర్లు వినిపిస్తున్నాయి. ఎవరు ఖాయమవుతారనేది చూడాలి.    
prabhas
pooja hegde

More Telugu News