Thamanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

షార్ట్స్‌లో చూడండి
*  మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా రచనలు కూడా చేస్తుందట. ఈ విషయాన్ని తాజాగా తనే వెల్లడించింది. "నా గురించి ఎవరికీ తెలియని రహస్యం ఇది. నేను అప్పుడప్పుడు కొన్ని రచనలు కూడా చేస్తుంటాను. ఏవైనా ఆలోచనలు కలిగినప్పుడు వాటిని పేపర్ పై పెడుతుంటాను. అలా అని ఎక్కువగా ఏమీ రాయలేదు. మనసు స్పందించినప్పుడు ఏవో కొన్ని రాసుకున్నాను.. అయితే వాటిని ఎవరికీ చూపించాలని మాత్రం అనిపించదు' అని చెప్పింది.
*  సమంత నటించిన 'యూ టర్న్' చిత్రం కోసం ఓ ప్రత్యేకమైన ప్రమోషనల్ సాంగును చిత్రీకరించారు. సమంతపై చిత్రీకరించిన ఈ పాటను సోమవారం ఉదయం విడుదల చేస్తారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.
*  రాంగోపాల్ వర్మ తాజాగా తెలుగు, కన్నడ భాషల్లో  నిర్మించిన 'భైరవ గీత' చిత్రం తెలుగు రాష్ట్రాల ప్రదర్శన హక్కులను అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా సొంతం చేసుకున్నారు. సిద్ధార్థ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని వచ్చే నెలలో రిలీజ్ చేస్తారు.
Go Back to Shorts
Thamanna
Samantha
Varma

More Telugu News