amitabh: తమిళ మూవీలోనూ కీలకమైన పాత్రలో అమితాబ్

షార్ట్స్‌లో చూడండి
హిందీ సినిమాలతో అమితాబ్ ఎప్పుడూ బిజీనే. అయినా కథ .. పాత్ర నచ్చితే దక్షిణాది చిత్రాలలోను నటించడానికి ఆయన ఆసక్తిని చూపుతుంటారు. తెలుగులో ఆయన 'సైరా' సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. చారిత్రక నేపథ్యంతో కూడిన కథ కావడం వలన .. తన పాత్రకి గల ప్రాధాన్యత వలన .. మెగా ఫ్యామిలీతో గల సాన్నిహిత్యం కారణంగా ఆయన ఈ సినిమా చేశారు.

ఇక తమిళంలోను ఆయన ఒక సినిమా చేయడానికి అంగీకరించారు. తమిళ యువ దర్శకుడు 'వణ్ణన్' ఒక విభిన్నమైన కథా చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రకి గాను ఆయన ఎస్.జె. సూర్యను తీసుకున్నాడు. మరో కీలకమైన పాత్రకి గాను అమితాబ్ ను ఒప్పించినట్టు చెబుతున్నారు. ఈ సినిమాలో అమితాబ్ చేసేది గెస్టు రోల్ కాదు .. సినిమా అంతా ఆయన కనిపిస్తూనే ఉంటారని చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.             
Go Back to Shorts
amitabh
s j surya

More Telugu News