పని మనిషితో ట్రంప్ కు అక్రమ సంతానం!
- ట్రంప్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన పని మనిషి
- వెల్లడించిన ట్రంప్ టవర్ మాజీ కాపలాదారుడు
- అమెరికన్ మీడియా ఇంక్ తో ఒప్పందం వల్ల ఇంత కాలం వెలుగు చూడని వాస్తవం
పెళ్లి చేసుకోకుండానే ఓ పని మనిషితో ట్రంప్ సంబంధం పెట్టుకున్నారని... ట్రంప్ ద్వారా ఆమెకు ఓ బిడ్డ జన్మించిందని డినో సాజుదిన్ అనే కాపలాదారుడు తన న్యాయవాది ద్వారా వెల్లడించాడు. ఈ విషయాన్ని ఎవరితో చెప్పకూడదని అమెరికన్ మీడియా ఇంక్ తో తన క్లయింట్ డినో ఒప్పదం కుదుర్చుకున్నాడని... ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటపడ్డాడని సదరు న్యాయవాది తెలిపారు. ఈ అంశంపై వైట్ హౌస్ ఇంతవరకు స్పందించలేదు.