Hindus: 'లవ్ రాత్రి' పేరు మార్చండి: జాతీయ హిందూ ఆందోళన డిమాండ్‌

షార్ట్స్‌లో చూడండి
సల్మాన్‌ ఖాన్‌ నిర్మించిన 'లవ్ రాత్రి' సినిమాపై జాతీయ హిందూ ఆందోళన సమితి సభ్యులు మండిపడ్డారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఈ చిత్రం పేరును తక్షణం మార్చాలని డిమాండ్‌ చేస్తూ బెంగళూరులోని జిల్లాధికారి కార్యాలయం ముందు ధర్నా చేశారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.

నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించుకునే సమయంలో ఈ చిత్రం విడుదల హిందువులను అవమానపర్చడమేనన్నారు. 27 ఏళ్లుగా సొంత రాష్ట్రాన్ని వదులుకుని పరాయి రాష్ట్రాలలో బతుకుతున్న కశ్మీర్‌ హిందువుల గురించి ఏ మాత్రం పట్టించుకోని పార్టీలు ఇతర దేశాల వారిపై జాలి చూపడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. తక్షణం చిత్రం పేరు మార్చకుంటే ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు.
Go Back to Shorts
Hindus
Loveratri
Salman Khan
Bollywood

More Telugu News