ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్.. విమానంలో ఏపీ స్పీకర్.. తప్పిన పెను ప్రమాదం!
- శంషాబాద్ నుంచి తిరుపతికి బయలుదేరిన విమానం
- టేకాఫ్ అయిన అరగంటకే సాంకేతిక సమస్య
- వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేసిన పైలట్
విమానం టేకాఫ్ అయిన అరగంట తర్వాత విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వెంటనే అప్రమత్తమైన పైలట్ శంషాబాద్ విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. వారు అనుమతించడంతో విమానాన్ని వెనక్కి మళ్లించాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ కావడంతో అందులో ఉన్న 68 మంది ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.