కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ మృతి

  • ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో కన్నుమూత
  • ధ్రువీకరించిన పార్టీ వర్గాలు
  • ముంబై పార్టీ అధ్యక్షుడిగానూ సేవలు
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి గురుదాస్ కామత్ (63) కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఈ విషయాన్ని పార్టీ ధ్రువీకరించింది. గురుదాస్ గతంలో ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడిగానూ పనిచేశారు. గురుదాస్ మరణానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.
Go Back to Shorts
Congress
Gurudas Kamat
Union Minister
Died
India
Mumbai

More Telugu News