కేరళకు సాయం చేద్దాం..భారతీయ సోదరులను ఆదుకుందాం రండి: యూఏఈ వైస్ ప్రెసిడెంట్ పిలుపు
- మనమందరం కలిసి ఆ రాష్ట్రాన్ని ఆదుకుందాం
- యూఏఈలో ఉండే భారతీయులతో కలిసి సాయం
- మీరు చేయగలిగిన సాయం చేయండి: షేక్ మహమ్మద్ ట్వీట్
‘ప్రకృతి అందాలకు నెలవైన కేరళకు కష్టమొచ్చింది. మనమందరం కలిసి ఆ రాష్ట్రాన్ని ఆదుకుందాం. మనకు చేతనైన సాయం చేద్దాం. యూఏఈలో ఉండే భారతీయులతో కలిసి కేరళకు సాయం చేయబోతున్నామని, మీరు కూడా వచ్చి మాతో చేతులు కలపండి. అక్కడి వారందరికీ తక్షణ సాయం అందించడానికి మేం ఓ కమిటీగా ఏర్పడ్డాం. మాతో వచ్చి మీరు చేయగలిగిన సాయం చేయండి... భారతీయ సోదరులను ఆదుకుందాం రండి’ అని బిన్ రషీద్ పిలుపు నిచ్చారు.