ప్రముఖ క్రికెటర్, భారత మాజీ టెస్ట్ కెప్టెన్ అజిత్ వాడేకర్ మృతి!
- దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వాడేకర్
- తాజా, మాజీ క్రికెటర్ల సంతాపం
- ఎనిమిదేళ్ల కెరీర్‌లో 37 టెస్టులాడిన అజిత్
అజిత్ వాడేకర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్. 1971లో విదేశీ గడ్డపై వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు సిరీస్ ఆయనకు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్‌ను గెలవడం ద్వారా వాడేకర్ పేరు మార్మోగింది. తన ఎనిమిదేళ్ల కెరీర్‌లో 37 టెస్టులు ఆడిన వాడేకర్ 14 అర్ధ సెంచరీలు, ఓ సెంచరీతో 2113 పరుగులు చేశారు. టీమిండియా తొలి వన్డే కెప్టెన్‌గానూ వాడేకర్ రికార్డులకెక్కారు. అయితే, కేవలం రెండు వన్డేలు మాత్రమే ఆడారు. రిటైరైన తర్వాత అజారుద్దీన్ కెప్టెన్సీలో భారత జట్టుకు మేనేజర్‌గా వాడేకర్ సేవలందించారు.