పాకిస్తాన్ అంతా నన్ను 'వదిన' అని పిలుస్తుంది!: సానియా మీర్జా
- భారత్-పాక్ ల కోసం మేం పెళ్లి చేసుకోలేదు
- అత్తవాళ్లింటికి ఏడాదికోసారే వెళతాను
- రోజూ 4-5 కి.మీ నడుస్తా
‘పాకిస్తాన్ లోని మా అత్తవాళ్లను కలవటానికి ఏడాదికోసారి మాత్రమే వెళతాను. పాకిస్తాన్ ప్రజలు నాపై అపారప్రేమ కురిపిస్తారు. ఆ దేశం అంతా నన్ను వదిన అని పిలుస్తుంది. షోయబ్ ను క్రికెటర్ గా పాక్ ప్రజలు అభిమానిస్తారు. ఆ అభిమానమే నాపై ప్రేమగా మారింది’ అని చెప్పారు.
ప్రస్తుతం 8వ నెల గర్భవతిగా ఉన్న సానియా త్వరలోనే తల్లికానుంది. నెలలు నిండినా తాను రోజుకు 4-5 కిలోమీటర్లు నడుస్తానని సానియా చెప్పింది. వారానికి నాలుగుసార్లు యోగా చేస్తానని తెలిపింది.