Pakistan: ఆ ఇంగితజ్ఞానం కూడా టీడీపీ ప్రభుత్వానికి లేదు: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
'అత్తిలి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో టాయిలెట్ సౌకర్యం లేదు. ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తారు? కనీసం ఆ సౌకర్యం కల్పించాలన్న ఇంగితజ్ఞానం కూడా టీడీపీ ప్రభుత్వానికి లేదు' అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ‘ఆడపిల్లలకు అండగా ఉంటామని చెప్పే టీడీపీ ప్రభుత్వం, కళాశాలల్లో టాయిలెట్ సౌకర్యం కల్పించాలని ఏ రోజన్నా ఆలోచించిందా? లక్ష కోట్లు దోచుకోవడానికి చూపించే చొరవ, ఉత్సాహం.. ఆడపిల్లలకు టాయిలెట్ ఏర్పాటు చేసే విషయంలో తెలుగుదేశం ప్రభుత్వానికి లేదు.

ఏ నియోజకవర్గానికి వెళ్లినా, గ్రామానికి వెళ్లినా ప్రాథమిక సౌకర్యాలు లేవని, ఆసుపత్రి లేదని, రోడ్లు బాగా లేవని, నీరు కలుషితమైపోయిందని, నిరుద్యోగ సమస్య...అని చెబుతున్నారు. ‘మా అబ్బాయికి ఉద్యోగం ఇస్తే చాలు, నిరుద్యోగ సమస్య తీరిపోయినట్టే’ అని ముఖ్యమంత్రిగారు అనుకుంటున్నారు! వాళ్ల అబ్బాయి లోకేశ్ కు ఉద్యోగం ఇస్తే యువత అందరికి ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు అనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి’ అని పవన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
Go Back to Shorts
Pakistan
Chandrababu
Nara Lokesh

More Telugu News