బయటి ఆహారాన్ని అనుమతిస్తే భద్రతా పరమైన సమస్యలా, ఎలాగో చెప్పండి?: ‘మహా’ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
- ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమన్న ప్రభుత్వం
- తలదూరిస్తే భద్రతాపరమైన సమస్యలు వస్తాయంటూ కోర్టుకు తెలిపిన వైనం
- ఎటువంటి సమస్యలు వస్తాయో చెప్పాలన్న ధర్మాసనం
ఈ వివాదంలో తాము తలదూర్చలేమని, తాము జోక్యం చేసుకుంటే గందరగోళం ఏర్పడుతుందని, భద్రతాపరమైన సమస్యలు వస్తాయని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీంతో స్పందించిన కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. సినిమా హాళ్లలోకి బయటి ఆహారాన్ని తెచ్చుకోవద్దని చెప్పే ప్రత్యేకమైన చట్టం ఏమీ లేదని పేర్కొన్న కోర్టు, ప్రేక్షకులను ఆహారం తెచ్చుకోకుండా అడ్డుకోలేరని తేల్చి చెప్పింది.