నాలుగు రోజుల్లో 40 కోట్లు రాబట్టిన 'సాక్ష్యం'!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాలుగు రోజుల్లో 40 కోట్లు రాబట్టిన 'సాక్ష్యం'!

  • గత నెల 27వ తేదీన విడుదలైన సాక్ష్యం 
  • శ్రీనివాస్ కి మాస్ ఇమేజ్ 
  • గ్లామర్ పరంగా పూజాకి క్రేజ్  
శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ ..  పూజా హెగ్డే జంటగా రూపొందిన 'సాక్ష్యం' .. క్రితం నెల 27వ తేదీన థియేటర్స్ కి వచ్చింది. పంచభూతాల నేపథ్యంలో నడిపించిన ఈ కథకి ప్రేక్షకుల ఆదరణ లభించింది. యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడంలో దర్శకుడు శ్రీవాస్ సక్సెస్ అయ్యాడు. భారీ ఓపెనింగ్స్ తో మొదలైన ఈ సినిమా .. ప్రస్తుతం థియేటర్స్ లో అదే జోరును కొనసాగిస్తోంది.

40 కోట్లతో నిర్మించబడిన ఈ సినిమా, తొలి నాలుగు రోజుల్లోనే 40 కోట్ల గ్రాస్ ను రాబట్టేసిందని చెబుతున్నారు. ఇక శాటిలైట్ .. డిజిటల్ రూపంలో 12 కోట్ల వరకూ రావడం విశేషం. బెల్లంకొండ శ్రీనివాస్ కి మాస్ లో మంచి క్రేజ్ వుంది. ఇక గ్లామర్ పరంగా పూజా హెగ్డేకి ఒక రేంజ్ లో ఇమేజ్ వుంది. వీటికి తోడు దర్శకుడు శ్రీవాస్ ఎంచుకున్న కథ, కథనాన్ని నడిపించిన తీరు ఈ స్థాయి వసూళ్లకు కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  
srinivas
pooja hegde

More Telugu News