ముందుగా రానున్న 'శైలజా రెడ్డి అల్లుడు?'

  • చందూ మొండేటితో 'సవ్యసాచి'
  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • విడుదల విషయంపై చర్చలు    
నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా రూపొందింది. ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో నిధి అగర్వాల్ కథానాయికగా నటించింది. ఈ సినిమాతో పాటు నాగచైతన్య .. మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేశాడు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో చైతూ జోడీగా అనూ ఇమ్మాన్యుయేల్ నటించింది.

ఈ రెండు సినిమాలను చైతూ సమాంతరంగా చేయడం వలన, విడుదల విషయంలో దర్శక నిర్మాతలు తర్జనభర్జనలు పడుతున్నట్టుగా ఫిల్మ్ నగర్ టాక్. రెండు సినిమాలు పెద్ద బ్యానర్లోవి కావడం వలన, నిర్ణయాన్ని చైతూ వాళ్లకే వదిలేశాడట. దాంతో రెండు సినిమాల దర్శక నిర్మాతలు, విడుదల విషయంపై చర్చలు జరుపుతున్నారట. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. ఈ రెండింటిలో 'శైలజా రెడ్డి అల్లుడు' ముందుగా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.     
chaithu
anu emmanuel
nidhi agarwal

More Telugu News