సూపర్ మార్కెట్ లో పోలీసావిడ చేతివాటం.. అడ్డుకున్న ఉద్యోగిపై దాడి!
- తమిళనాడులో మహిళా కానిస్టేబుల్ చేతివాటం
- క్షమాపణ పత్రం ఇవ్వాలని ఉద్యోగి డిమాండ్
- భర్తను పిలిపించి చావగొట్టించిన అధికారిణి
వెంటనే ఆమె దగ్గరకు వెళ్లి దొంగలించిన వస్తువులను వెనక్కి ఇవ్వాలనీ, భవిష్యత్ లో ఇలాంటి పనులు చేయనని క్షమాపణ పత్రాన్ని రాసివ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన సదరు మహిళా కానిస్టేబుల్ ఈ వ్యవహారంపై తన భర్తకు సమాచారమిచ్చింది. కొందరు వ్యక్తులతో కలసి అక్కడకు చేరుకున్న కానిస్టేబుల్ భర్త, ప్రణవ్ పై విచక్షణారహితంగా దాడిచేశాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ప్రణవ్ ను సూపర్ మార్కెట్ లోని సహోద్యోగులు ఎలాగోలా రక్షించి ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు చెన్నై పోలీసులు తెలిపారు.