'బిగ్ బాస్' షోపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కామెంట్!
- బిగ్ బాస్ షోలో అందరి మైండ్ లను బిగ్ బాస్ కంట్రోల్ చేస్తుంటారు
- ఆయన మైండ్ ను ఎవరూ కంట్రోల్ చేయలేరు
- మన మైండ్ ను మనం కంట్రోల్ చేసుకోవాలంటే ప్రాణాయామం చేయాలి
టీవీలో వస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో చూడటం కోసం యువత ప్రతి రోజు 2 గంటల సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నారని ఆయన చెప్పారు. ఈ షో మొత్తం బిగ్ బాస్ చెప్పినట్టు నడుస్తుంటుందని... అందరి మైండ్ లను బిగ్ బాస్ కంట్రోల్ చేస్తుంటాడని, బిగ్ బాస్ ను మాత్రం ఎవరూ కంట్రోల్ చేయరని అన్నారు. మన మైండ్ ను మనమే కంట్రోల్ చేసుకోవాలంటే ప్రాణాయామం చేయాలని సూచించారు. యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.