ఎట్టకేలకు '2.0' రిలీజ్ డేట్ చెప్పేసిన శంకర్!
- వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ డేట్ వచ్చేసిందట
- నవంబర్ 29న విడుదలకు సిద్ధం
- ట్విట్టర్ లో వెల్లడించిన దర్శకుడు శంకర్
"హాయ్ ఎవ్రీవన్... చిట్టచివరికి వీఎఫ్ఎక్స్ కంపెనీలు వీఎఫ్ఎక్స్ షాట్స్ డెలివరీ డేట్ ను ఎనౌన్స్ చేశాయి. ఈ సినిమా నవంబర్ 29న విడుదల కానుంది" అని శంకర్ ట్వీట్ చేశారు. సూపర్ హిట్ చిత్రం 'రోబో'కు సీక్వెల్ గా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కూడా నటించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చారు. సినిమాలో గ్రాఫిక్ వర్క్ అధికంగా ఉన్న కారణంగా ఇప్పటికే పలుమార్లు విడుదల తేదీ వాయిదా పడుతూ వచ్చింది.