sai dharam tej: కమెడియన్ గా మళ్లీ బిజీ అవుతోన్న సునీల్

షార్ట్స్‌లో చూడండి
కమెడియన్ గా సునీల్ ఒక రేంజ్ సక్సెస్ చూశాడు. ఆయన లేని సినిమా దాదాపుగా ఉండేది కాదు. అలాంటి క్రేజ్ తోనే సునీల్ హీరోగా మారిపోయాడు. ఆరంభంలో వరుస విజయాలు పలకరించినా, ఆ తరువాత సక్సెస్ అనేది ఆయనకి బాగా దూరమైంది. ఈ నేపథ్యంలో ఆయన తిరిగి కమెడియన్ గా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అంతే, వరుస అవకాశాలు ఆయనను వెతుక్కుంటూ వస్తున్నాయి.

 శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా చేస్తోన్న 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమాలో సునీల్ కమెడియన్ గా చేస్తున్నాడు. ఇక శర్వానంద్ తాజా చిత్రంలోను కమెడియన్ గా సునీల్ సందడి చేయనున్నాడు. తాజాగా సునీల్ మరో సినిమాకి ఓకే చెప్పాడు. సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు కిషోర్ తిరుమల ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. 'చిత్రలహరి' .. బార్ అండ్ రెస్టారెంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్ర కోసం సునీల్ ను తీసుకున్నట్టుగా సమాచారం. మొత్తానికి కమెడియన్ గా సునీల్ మళ్లీ బిజీ అవుతున్నాడన్న మాట. 
Go Back to Shorts
sai dharam tej
sunil

More Telugu News