నా పిల్లల సంతోషం కోసమే నా కోపాన్ని పక్కన పెట్టేశాను: రేణు దేశాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా పిల్లల సంతోషం కోసమే నా కోపాన్ని పక్కన పెట్టేశాను: రేణు దేశాయ్

  • పిల్లల కోసం పవన్ వస్తుంటారు 
  • పిల్లల సంతోషం నాకు ముఖ్యం 
  • తల్లిగా అది నా బాధ్యత        
ఇటీవలే రేణు దేశాయ్ కి వేరొకరితో నిశ్చితార్థం జరిగింది. దాంతో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయాలపై తన మనసులోని మాటను ఆమె బయటపెట్టింది. "ఏడాదికి రెండు మూడు సార్లు పవన్ తన పిల్లల కోసం వచ్చేవారు. అంటే ఏడాదిలో పదకొండున్నర నెలల పాటు పిల్లల బాధ్యతను నేను చూస్తూ వస్తున్నాను. తనకి సమయం దొరికితే మాత్రం పిల్లల్ని చాలా బాగా చూసుకునేవారు.

నా స్నేహితురాలు అంటూ వుంటుంది .. ఇదే పని నా భర్త చేసి వుంటే జీవితంలో ఆయన ముఖం నేను చూసి వుండే దానిని కాదు అని. ఆయన వచ్చినప్పుడల్లా నువు ఎలా మామూలుగా ఉండగలుగుతున్నావు? అని అడుగుతుంది. జరిగిందేదో జరిగిపోయింది .. పిల్లలు వున్నారు .. వాళ్ల కోసం నేను కోపాన్ని వదిలేశాను. ఒక తల్లిగా వాళ్లను సంతోష పెట్టవలసిన బాధ్యత నాపై వుంది. పిల్లల సంతోషం కోసం వాళ్ల పేరెంట్స్ .. ఫ్రెండ్స్ లా వుండాలని భావించి .. నేను అలా ఉంటూ వస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.      
renu desai

More Telugu News