నన్ను వదిన అంటే ఆనందమే .. కానీ పవన్ తో ముడిపెడుతూ అలా పిలవొద్దు!: రేణు దేశాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నన్ను వదిన అంటే ఆనందమే .. కానీ పవన్ తో ముడిపెడుతూ అలా పిలవొద్దు!: రేణు దేశాయ్

  • మామూలుగా వదిన అంటే ఫర్లేదు 
  • పవన్ పేరును జోడించవద్దు 
  • నేను ఇప్పుడు ఆయన భార్యను కాదు   
రేణు దేశాయ్ దర్శక నిర్మాతగా మారిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుంటున్నారు. ఆమె పవన్ నుంచి విడిపోయినా ఆయన ఫ్యాన్స్ ఆమెను వదిన అనే సంబోధిస్తుంటారు. అదే విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె ప్రస్తావిస్తూ .. "పవన్ అభిమానులు నన్ను వదిన అంటే అందుకు నాకు బాధగా ఉండదు .. ఆనందంగానే ఉంటుంది. అయితే నన్ను పవన్ కల్యాణ్ భార్యగా భావిస్తూ వదిన అంటే మాత్రం బాధగా ఉంటుంది.

వదినమ్మ అనేది చాలా మంచి మాట .. అలా పిలవడం వలన నాకు ప్రోబ్లం లేదు. పవన్ పేరును జోడిస్తూ అలా పిలవడమే సమస్య. నేను ఇప్పుడు ఆయన భార్యను కాదు కదా .. మాములుగా వదిన అనండి .. కాదనను. ఆల్రెడీ ఆయనకి ఇంకొకరితో పెళ్లైపోయింది .. ఇద్దరు పిల్లలు వున్నారు. ఆయన అభిమానులకు సంబంధించి ఆవిడ వదిన కదా. ఆయన పేరును కలుపుతూ నన్ను వదిన అనడంలోనే నాకు ఇబ్బంది వుంది" అంటూ ఆమె తన మనసులోని మాటను బయటపెట్టారు.     
renu desai

More Telugu News