పోలీసులు వేధిస్తున్నారంటూ.. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న మహిళా ఎమ్మెల్యే!

కొంత కాలంగా తమ పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత ప్రోద్బలంతో తన కుటుంబ సభ్యులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ మధ్యప్రదేశ్‌ శాసనసభలో బీజేపీ మహిళా ఎమ్మెల్యే నీలిమా అభయ్‌ మిశ్రా కన్నీరు పెట్టుకున్నారు. దీనిపై స్పందించిన స్పీకర్‌ హోం మంత్రిని వివరణ కోరారు. ఆమె ఆవేదనపై ఆ రాష్ట్ర హోంమంత్రి భూపేంద్రసింగ్‌ మిశ్రా స్పందిస్తూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

తనకు భద్రత కల్పించాలని స్పీకర్‌కు ఆమె విన్నవించింది. కాగా, ఆమెకు అండగా నిలచిన విపక్ష నేతలు అధికార పార్టీ ఎమ్మెల్యేకే భద్రత లేదని, ఇక సామాన్య ప్రజలకు ఎలా ఉంటుందని విమర్శలు చేశారు. దీంతో అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది. ఈరోజు శాసనసభలో జీరో అవర్‌లో ఈ పరిస్థితి నెలకొంది. సభలోనే కన్నీరు మున్నీరైన ఆమెను కాంగ్రెస్‌, బీజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఓదార్చారు. రివా జిల్లాకు చెందిన ఎమ్మెల్యే నీలిమ.. సిమరియా నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
Go Back to Shorts
Madhya Pradesh
BJP
mla

More Telugu News