Maharashtra: కుమార్తె కావాలనుకుంటే... కొడుకు పుట్టాడని ఓ తల్లి చేసిన దారుణం!

షార్ట్స్‌లో చూడండి
సాధారణంగా కుమారుడు పుట్టలేదని, ఆడబిడ్డలను హతమార్చే ఘటనలు చూస్తుంటాం. కానీ ఇది అందుకు పూర్తి భిన్నం. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో కుమార్తెను కోరుకున్న ఓ తల్లి, తనకు ఆడబిడ్డ పుట్టలేదన్న నిరాశతో, పుట్టిన కుమారుడిని దారుణంగా హతమార్చింది. ఆపై తనకేమీ తెలియనట్టు కుమారుడు కనిపించడం లేదని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రంగంలోకి దిగి అసలు విషయం తేల్చారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఔరంగాబాద్ జిల్లా పైఠణ్ తహసీల్ పరిధిలోని పైఠణ్‌ ఖేడ్ గ్రామంలో దేవిక ఇరాండే అనే మహిళకు ఓ కుమారుడు ఉండగా, మళ్లీ గర్భం దాల్చింది.

ఈసారి తనకు కుమార్తె పుడుతుందని ఆమె భావిస్తూ వచ్చింది. చివరకు కుమారుడే పుట్టాడు. బాలుడికి ప్రేమ్ పరమేశ్వర్ ఇరాండే అని పేరు పెట్టిన దేవిక, ఆమె భర్త, బిడ్డను 10 నెలలు సాకారు. ఈ క్రమంలో తన కుమారుడు కనిపించడం లేదని దేవిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు జాగిలాలను రంగంలోకి దించగా, అది ఆ ఇంట్లోనే అటూ ఇటూ తిరిగి, ఓ నీటి డ్రమ్ము వద్ద ఆగింది. ఆ డ్రమ్ములోనే బిడ్డ మృతదేహం ఉండటంతో పోలీసులు దేవికను విచారించి నిజాన్ని బయటకు లాగారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండుకి తరలించారు. 
Go Back to Shorts
Maharashtra
Daughter
Sun
Murder

More Telugu News