చంద్రబాబుపై మండిపడ్డ హరీష్ రావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబుపై మండిపడ్డ హరీష్ రావు

  • గతంలో తెలంగాణను అడ్డుకున్నారు 
  • కాళేశ్వరం ప్రాజెక్టును చూసి ఆయన కళ్లు మండుతున్నాయి
  • ఎవరు అడ్డుపడ్డా ప్రాజెక్టులను కట్టితీరుతాం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో తెలంగాణను అడ్డుకున్నారని... ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మనం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకుంటుంటే చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏమిటో అర్థంకావడం లేదని చెప్పారు.

రాత్రింబవళ్లు కష్టపడి ప్రాజెక్టును కట్టుకుంటుంటే చంద్రబాబుకు కళ్లు మండుతున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టును ఆపాలంటూ ఢిల్లీకి ఫిర్యాదు కూడా చేశారని అన్నారు. తెలంగాణను తెచ్చుకున్నదే నీళ్ల కోసమని... గోదావరిలో 954 టీఎంసీల వాటా మనకు ఉందని చెప్పారు. ఎవరు అడ్డుపడ్డా రాష్ట్రంలో ప్రాజెక్టులను కట్టి తీరుతామని... రైతులకు నీళ్లు ఇచ్చితీరుతామని తెలిపారు.
Chandrababu
harish rao

More Telugu News