కాసేపు ప్రయాణికులను గడగడలాడించిన హైదరాబాద్ - తిరుపతి ఇండిగో విమానం!
- ఉదయం 6.25కు టేకాఫ్
- పావుగంటలోనే సాంకేతిక లోపం
- లోపాన్ని గుర్తించి ఎమర్జెన్సీ ల్యాండ్ చేసిన పైలట్
విమానం ఎందుకు వెనక్కు వస్తోందో తెలియని 65 మంది ప్రయాణికులు ఆ పావుగంట పాటు భయంతో ఆందోళనకు గురయ్యారు. ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ తరువాత, బతుకుజీవుడా అంటూ కిందకు దిగిన వారు, మరో ప్రత్యామ్నాయం చూపాలని ఇండిగో సిబ్బందిని అడిగినా వారు ఏ మాత్రమూ స్పందించలేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తమ గమ్యానికి ఎలా చేరుకోవాలని ప్రశ్నిస్తున్నారు.