USA: అమెరికాలో టాలీవుడ్ సెక్స్ రాకెట్: 'ఇక వద్దంటూ' వేడుకున్న తెలుగు హీరోయిన్.. బెదిరించిన కిషన్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు చిత్ర పరిశ్రమలో తాజా సంచలనంగా నిలిచి చర్చనీయాంశమైన 'అమెరికాలో తెలుగు నటీమణుల సెక్స్ స్కామ్'లో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వర్ధమాన తారలను, ఓ వెలుగు వెలుగుతున్న వారిని విజిటింగ్ వీసాలపై అమెరికాకు పిలిపించి, పలు ప్రాంతాల్లో ఉంచి వారితో వ్యభిచారం చేయించిన కేసులో మోదుగుమూడి కిషన్, ఆయన భార్య చంద్రలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

వీరిద్దరి ఆగడాలపై చికాగో కోర్టులో 42 పేజీల చార్జ్ షీట్ కూడా దాఖలైంది. ఇక అతని పిలుపు మేరకు డిసెంబర్ 2017లో అమెరికాకు వెళ్లి వచ్చిన ఓ నటి, ఆపై కిషన్ ను వేడుకుంటూ ఓ ఈమెయిల్ రాయగా, దాన్ని చూసిన పోలీసులు, ఆమెను విక్టిమ్ - ఏగా చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఆమె తన ఈ-మెయిల్ లేఖలో... దయచేసి తనకు ఇక ఫోన్ చేయవద్దని, కాంటాక్ట్ కూడా చేయడానికి ప్రయత్నించవద్దని, మీతో కలసి 'వ్యాపారం' చేయడం తనకు ఇబ్బందిగా ఉందని వాపోయింది. మళ్లీ కాంటాక్ట్ చేస్తే తాను ఫిర్యాదు చేస్తానని కూడా హెచ్చరించింది.

ఇక దీనికి బదులిచ్చిన కిషన్, పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఆమెను, ఆమె కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరింపులకు దిగాడు. ఈ బెదిరింపు లేఖ తమ విచారణలో కీలకమైందని, దీనితో పాటు పలువురు తారలకు రాసిన ఈ-మెయిల్స్, కిషన్ భార్య చంద్ర సెల్ ఫోన్ లోని టెక్ట్స్ మెసేజ్ లు తమకు లభించాయని చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. చంద్ర ఓ పుస్తకంలో ఎవరు ఎప్పుడు వచ్చి ఎక్కడున్నారు? వారి దగ్గరకు ఎవరెవరు వచ్చారు? ఎంత ఇచ్చారు? తదితర వివరాలన్నీ రాసుకోగా, దాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Go Back to Shorts
USA
Tollywood
S*x Racket
Arrest
Kishan
Chandra
Police

More Telugu News