shankar: ముందుగా బాధపడినా .. ఆ తరువాత ఆనందపడ్డాను: తమిళ దర్శకుడు శంకర్

షార్ట్స్‌లో చూడండి
తమిళ అగ్రదర్శకుడు శంకర్ ప్రస్తుతం '2.ఓ' సినిమా పనులతో బిజీగా వున్నారు. చెన్నైలో నిన్న సాయంత్రం జరిగిన 'ట్రాఫిక్ రామస్వామి' ఆడియో వేడుకకి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ వేదికపై ఆయన మాట్లాడుతూ .. "2.ఓ' సినిమా తరువాత రజనీకాంత్ హీరోగా 'ట్రాఫిక్ రామస్వామి' బయోపిక్ ను చేయాలనుకున్నాను. కానీ ఈ లోగా ఈ బయోపిక్ ను వేరేవాళ్లు మొదలుపెట్టేశారని తెలిసి చాలా బాధపడ్డాను.

'ట్రాఫిక్ రామస్వామి'గా హీరో విజయ్ తండ్రి ఎస్.ఎ.చంద్రశేఖర్ గారు నటిస్తున్నారని తెలిసిన తరువాత చాలా ఆనందపడ్డాను. తమిళనాడులో ట్రాఫిక్ కి సంబంధించిన సమస్యల పరిష్కారానికి రామస్వామి ఎంతగానో కృషి చేశారు. అప్పట్లో ఆయన గురించి పేపర్లో చదివి ఆశ్చర్యపోయేవాడిని .. మనసులోనే అభినందించేవాడిని. ఆయన పాత్రలో ఎస్.ఎ.చంద్రశేఖర్ గారు అద్భుతంగా ఒదిగిపోతారని నాకు తెలుసు. ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 
Go Back to Shorts
shankar

More Telugu News