rahul vijay: మరో ప్రేమకథా చిత్రంగా 'ఈ మాయ పేరేమిటో' .. టీజర్ రిలీజ్

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై ప్రేమకథలదే పెద్దపీట అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఈ మాయ పేరేమిటో' సినిమా రెడీ అవుతోంది. దివ్య విజయ్ నిర్మాణంలో .. రాము కొప్పుల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. రాహుల్ విజయ్ .. కావ్య థాపర్ ఈ సినిమా ద్వారా నాయకా నాయికలుగా పరిచయమవుతున్నారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ .. మురళీ శర్మ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు. నాగచైతన్య చేతుల మీదుగా ఈ టీజర్ ను రిలీజ్ చేయించారు. హీరో హీరోయిన్లు సరదాగా చక్కర్లు కొట్టడం .. వాళ్ల సరదాలు .. సందడికి సంబంధించిన సన్నివేశాలపై ఈ టీజర్ ను కట్ చేశారు. ఫోటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఆకట్టుకునేలా వున్నాయి. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. 
Go Back to Shorts
rahul vijay
kavya

More Telugu News