స్టార్ హీరోలతో సినిమాలు తగ్గించనున్న త్రివిక్రమ్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్టార్ హీరోలతో సినిమాలు తగ్గించనున్న త్రివిక్రమ్?

  • అగ్ర దర్శకుడిగా త్రివిక్రమ్ 
  • పెద్ద హీరోలతోనే ఎక్కువ సినిమాలు 
  • కొత్త కథలు .. పాత్రలపై దృష్టి  
తెలుగులోని అగ్రదర్శకుల జాబితాలో త్రివిక్రమ్ పేరు కనిపిస్తుంది. ఇంతవరకూ ఎక్కువగా స్టార్ హీరోలతోనే త్రివిక్రమ్ సినిమాలు చేస్తూ వచ్చాడు. అన్నివర్గాల ప్రేక్షకులను మెప్పిస్తూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అయితే ఇటీవల పవన్ కల్యాణ్ తో చేసిన 'అజ్ఞాతవాసి' ఆయనను పూర్తిగా నిరాశపరిచింది. అప్పటికే ఆయన ఎన్టీఆర్ తో సినిమాను కమిట్ కావడం వలన .. ప్రస్తుతం ఆయనతో 'అరవింద సమేత వీరరాఘవ' చేస్తున్నాడు.

ఈ సినిమా తరువాత ఆయన నాని హీరోగా ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అక్కడి నుంచి ఆయన ఆ స్థాయి హీరోలతోనే ఎక్కువగా సినిమాలు చేయాలనే నిర్ణయానికి వచ్చాడనేది తాజా సమాచారం. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే .. కథను వాళ్ల చుట్టూనే అల్లుకోవలసి వస్తోంది. అలా ఉంటేనే అభిమానులు అంగీకరిస్తారు కూడా. అందువలన మీడియం రేంజ్ హీరోలతో అయితే కథల పరంగాను .. పాత్రల పరంగాను కొన్ని ప్రయోగాలు చేయడానికి అవకాశం ఉంటుందని ఆయన భావిస్తున్నాడట. అందువలన ఎక్కువగా వాళ్లతో .. అడపా దడపా స్టార్ హీరోలతో చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పుకుంటున్నారు.  
trivikram

More Telugu News