BJP: బీజేపీ ఆధిపత్య ధోరణి వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయి: నారా లోకేశ్

షార్ట్స్‌లో చూడండి
ఈరోజు ప్రకటించిన పలు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు భవిషత్తులో బీజేపీ ఎదుర్కునే పరిస్థితులను తెలియజేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. బీజేపీ ఆధిపత్య ధోరణి, చేస్తోన్న ద్రోహం, దుష్పరిపాలన వల్లే ఇటువంటి ఫలితాలు వచ్చాయని ట్వీట్‌ చేశారు. దక్షిణాదిలో బీజేపీ గురించి ఆలోచించే అవసరం లేదని, ఆ పార్టీ ఉత్తరాదిన కూడా మొహం చూపించలేని పరిస్థితి ఉందని అన్నారు. ఇకనైనా బీజేపీ ఏపీ నేతలు మేల్కోవాలని, ఏపీకి నిధుల కేటాయింపులపై అసత్య లెక్కలు చెప్పడం మానేసి, తమ అధిష్ఠానం వద్ద రాష్ట్ర హక్కులపై పోరాడాలని పేర్కొన్నారు.  
Go Back to Shorts
BJP
Nara Lokesh
elections

More Telugu News