మిస్టరీ! బైకును ఢీకొట్టిన కారు.. అదృశ్యమైన బైకర్, కారు డ్రైవర్.. తలలు పట్టుకుంటున్న పోలీసులు!
- డీఎన్‌డీ ఫ్లైవేపై ప్రమాదం
- మిస్టరీగా మారిన డ్రైవర్ల అదృశ్యం
- చిన్న క్లూ కూడా దొరకని వైనం
సరితా విహార్‌కు చెందిన అన్షుమన్ పురిని బైక్ యజమానిగా గుర్తించారు. అక్కడకు వెళ్లి చూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆ ఇంట్లో అన్షుమన్ ఒక్కడే ఉంటాడని ఇరుగుపొరుగు వారు పోలీసులకు తెలిపారు. ఖతార్ విహార్‌కు చెందిన బప్పాసింగ్‌ను కారు డ్రైవర్‌గా గుర్తించారు. గోయల్ డెయిరీ పేరుపై కారు రిజిస్టర్ అయి ఉంది. అతడి ఇంటికి వెళ్లిన పోలీసులకూ నిరాశే ఎదురైంది. ఆ ఇల్లు కూడా తాళం వేసి ఉంది. అతడు కెనడాలో ఉంటాడని, కుమార్తె, అల్లుడు మాత్రమే ఇక్కడ ఉంటారని చుట్టుపక్కల వారు తెలిపారు. కారును అల్లుడే ఉపయోగిస్తున్నాడని చెప్పడంతో పోలీసులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.