'సాక్ష్యం' కోసం పంచభూతాల నేపథ్యంలో భారీ ఫైట్లు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాక్ష్యం' కోసం పంచభూతాల నేపథ్యంలో భారీ ఫైట్లు!

  • పంచభూతాల నేపథ్యంలో 'సాక్ష్యం'
  • శ్రీనివాస్ జోడీగా పూజా హెగ్డే 
  • భారీస్థాయిలో యాక్షన్ సీన్స్
శ్రీవాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా 'సాక్ష్యం' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను జూన్ 14వ తేదీన విడుదల చేయనున్నట్టు చెప్పారు. అయితే ఆ రోజున ఈ సినిమా థియేటర్లకు వస్తుందా అనే విషయం ఆసక్తికరంగా మారింది.మొదటి నుంచి కూడా ఈ కథ పంచభూతాల నేపథ్యంలో కొనసాగుతుందని చెబుతూ వచ్చారు. ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ ను కూడా పంచభూతాల నేపథ్యంలోనే చిత్రీకరించారట. అంటే క్లైమాక్స్ ఫైట్ గా అయిదు రకాల యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించారట. అయిదు రకాల ఫైట్ల కారణంగా లెంగ్త్ ఎక్కువైపోవడంతో షార్ప్ చేసే పనిలో స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ వున్నట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా మరికొంత టెక్నికల్ వర్క్ కూడా మిగిలిపోయిందని తెలుస్తోంది. విడుదల తేదీనేమో దగ్గర పడిపోతోంది మరి!
srinivas
pooja hegde

More Telugu News