ఏపీకి రాయల్టీ బకాయిలను ముందుగానే విడుదల చేసిన కేంద్ర పెట్రోలియం శాఖ
- రూ. 237.53 కోట్ల రాయల్టీ బకాయిలు విడుదల
- ఉత్తర్వులను జారీ చేసిన కేంద్ర పెట్రోలియం శాఖ
- సెప్టెంబర్, అక్టోబర్ లో రావాల్సిన బకాయిలు ముందుగానే విడుదల
ఈ వివరాలను ఏపీ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ తెలియజేశారు. రాష్ట్రానికి రావలసిన రాయల్టీ బకాయిలను ప్రతి ఏటా సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో విడుదల చేస్తుండగా... సంబంధిత కేంద్ర అధికారులతో చర్చిస్తూ నిరంతర పర్యవేక్షణ చేయటంతో, ఈ సంవత్సరం రాష్ట్రానికి రావలసిన బకాయిలను మే నెలలోనే విడుదల చేయడం జరిగిందని ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.