Akhilapriya: మంత్రి కేటీఆర్‌ను వివాహానికి ఆహ్వానించిన ఏపీ మంత్రి అఖిలప్రియ

షార్ట్స్‌లో చూడండి
తన వివాహ వేడుకకు రావాల్సిందిగా ఏపీ మంత్రి అఖిలప్రియ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆహ్వానించారు. కాబోయే భర్త భార్గవ్‌తో కలిసి గురువారం హైదరాబాద్‌లో కేటీఆర్‌ను కలిసి ఆమె వివాహ ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా అఖిలప్రియ, భార్గవ్‌లకు మంత్రి కేటీఆర్ జ్ఞాపికను బహూకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్ర్రప్రదేశ్‌లో అఖిలప్రియ తల్లి దివంగత భూమా శోభా నాగిరెడ్డి, తాను 2009-2014 మధ్య శాసనసభ్యులుగా పనిచేశామని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. ఆగస్టు 29న అఖిలప్రియ వివాహం జరగనుంది.
Go Back to Shorts
Akhilapriya
KTR
Minister
Andhra Pradesh
TS

More Telugu News