IPL: ఐపీఎల్ కప్పు చెన్నైకే... సాక్ష్యాలు చూపుతూ జోస్యం చెప్పిన క్రికెటర్ మహమ్మద్ కైఫ్!

షార్ట్స్‌లో చూడండి
ఐపీఎల్ 2018 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలవనుందని క్రికెటర్ మహమ్మద్ కైఫ్ జోస్యం చెబుతున్నాడు. తన జోస్యానికి మద్దతిచ్చే సాక్ష్యాలను కూడా ఆయన చూపిస్తుండటం గమనార్హం. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టిన ఆయన, గడచిన ఐపీఎల్ 10 సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన ప్రతిసారీ, టాప్-2గా ఉన్న జట్టు కప్పును గెలిచిందని అన్నాడు.

2011, 2013, 2014 సంవత్సరాల్లో ఢిల్లీ జట్టు 8వ స్థానంలో ఉందని గుర్తు చేస్తూ, ఆయా సంవత్సరాల్లో టాప్-2లో ఉన్న జట్లు చెన్నై సూపర్ కింగ్స్ (2011), ముంబై ఇండియన్స్ (2013), కోల్ కతా నైట్ రైడర్స్ (2014) విజయం సాధించాయని గుర్తు చేశాడు. అదే రిపీటవుతుందని, ఆ కారణంగానే చెన్నై ఈ ఏటి విజేతగా నిలుస్తుందని అంటున్నాడు కైఫ్. చైన్నై గెలిస్తే, తనకు సంతోషమేనని చెప్పాడు.
Go Back to Shorts
IPL
Cricket
Chennai Superkings
Mohammad Kaif

More Telugu News